పరిపూర్ణ భక్తులను ప్రేమించు శివుడు….
నిస్వార్థ హృదయముల నివసించు హరుడు….
ఏ స్వార్ధము లేక క్షీరసాగర మథనమున తనువు నర్పించిన వాసుకీ….
నిదర్శనము నీవే కదా కాళమా మెడలోన మాలవై మాశివునికి…!!పరి!!
సకల గుణ సంపన్నుడు మా సాంబశివుడు….
అపర దయామయుడు మా ఆది శంకరుడు….
ఏ ప్రాణిలోనైనా చూసేది పరమేశ్వరుడు భక్తినొకటే…
ఏ స్వార్ధము లేక జన్మను అంకితము చేయు మనసు నొకటే….
అందుకే నువ్వంత ఇష్టమైనావు సర్పమా…
ఆభరణమయ్యావు శివునికి ఇంతకంటే నీకు భాగ్యమా…!!పరి!!
నాగభూషణుడై శివుడు పేరు గాంచె…
నాగేశ్వర నామదేవుడై హరుడు అవతరించె…
నాగరాజా… నాట్యావథానాలు చేయవయ్య…
సర్ప రాజా… సంకీర్తనలతో శివారాధన గావించవయ్య…
మాచేత పూజలందుకొను వరమిచ్చే నీకు ఆ పార్వతీ విభుడు…
నిన్ను దైవముగ మాకిచ్చి కరుణించే ఆ
దయామయుడు….!!పరి!!
పాహిమాం పాహిమాం నాగేశ్వరావు పాహిమాం…. వ
రక్షమాం రక్షమాం నాగచంద్రేశ్వర రక్షమాం…