క్షీరాబ్ది కన్యకవే శ్రీ మహాలక్ష్మీ…

క్షీరాబ్ది కన్యకవే శ్రీ మహాలక్ష్మీ…
శ్రీహరి ప్రియచంద్రికవే సౌభాగ్య లక్ష్మీ..
కమలాక్షి మాతవే కనకమహాలక్ష్మి…
శ్వేతాంబరధరే దేవి శ్రావణ వరలక్ష్మి…
లక్ష్మీ…జయలక్ష్మీ..శుభలక్ష్మీ మము కావవే…
లక్ష్మీ…గజలక్ష్మీ…శ్రీ లక్ష్మీ దయ చూపవే…!!క్షీరా!!

బంగారు మా తల్లి అందుకొనుమ పూజలు….
చెంగావి చీర తల్లి గైకొనుమా  వ్రతములు…
జలజాక్షి…నీ జడకై తెస్తిమమ్మా పువ్వులు…
పద్మాక్షి…నీ పెదవుల చూడనివ్వు నగవులు…
లక్ష్మీ…ధనలక్ష్మి…ఐశ్వర్య లక్ష్మి కావవే…
లక్ష్మీ…హరిలక్ష్మీ…ధనధాన్య లక్ష్మీ బ్రోవవే…!!క్షీరాబ్ది!!

అభయాలనిచ్చు తల్లి అభయహస్త లక్ష్మీ…
జయ విజయములను అందించే శ్రీ విజయలక్ష్మి….
సర్వాంగ సుందరముగా సిరుల నొసగు లక్ష్మీ…
విశ్వవ్యాపితముగా వికసించే పద్మనయన లక్ష్మి….
లక్ష్మీ మా లక్ష్మి విజయలక్ష్మి దీవించవే….
లక్ష్మీ…శ్రీ లక్ష్మీ…ఆదిలక్ష్మీ… కరుణించవే….!!క్షీరాబ్ది!!

పాహిమాం…పాహిమాం…పద్మ నయని పాహిమాం…రక్ష మాం..రక్షమాం…శ్రీ రాజ్యలక్ష్మి రక్షమాం…

Leave a Comment

Scroll to Top