ఎర్రా ఎర్రని ముక్కెరలో…

ఎర్రా ఎర్రని ముక్కెరలో…
ఎరుపెక్కిన పెదవుల మెరుపులలో..
సన్నా సన్నని నవ్వులలో…
సంపెంగల పువ్వుల వెన్నెలలో…
మెరిసేవమ్మా జననీ…
మాహేశుని మది స్థిర వాసినీ…!! ఎర్రా!!

ఈశుని సఖివే అంబా…
జంగమ ప్రియ సతివే జగదాంబ…
శంభుని కోవెలవమ్మా…
కోవెల సుందరి నీవెనమ్మా…
చిరుగజ్జెలతో చిందులువేస్తే మురిసేనమ్మా శంకరుడు…
జత చేరి తను నాట్యములాడా జావళి పాడును ఈశ్వరుడు…!!ఎర్రా!!

లోకాలేలే తల్లి…
శివుని లోకము నీవే తల్లి…
ప్రేమల సంపద తల్లీ…
హరునికి ప్రాణం నీవే తల్లీ…
వీణ నాదమై ఎదను మీటవే పంచును ప్రేమను మా శివుడు…
ప్రేమ మూర్తివై అల్లుకుపోతే అర్ధనారీశ్వరుడవు మా హరుడు…!!ఎర్రా!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరీ పాహిమాం…రక్ష మాం..రక్ష మాం…సర్వేశ్వరీ…రక్ష మాం…

Leave a Comment

Scroll to Top