అలమేలు మంగపతీ…ఆనందరూపుడా…
పద్మావతీ వల్లభుడా…ఏడు కొండలవాడా…
శ్రీ పతివి నీవు శ్రీనివాసా….
జగమునకు అధిపతివి నీవు వేంకటేశా…!!అల!!
అల ఏడుకొండలలో కొలువైతివి…
ఇల మా నిండు గుండెలలో నెలవైతివి…
వకుళ మాతకు నీవు వరమైతివి…
వడ్డీ కాసులవాడిగా స్థిరపడితివి…
గోవింద నామాల ప్రకంపనల ఝరులలో….
కని చూడు కేశవా..నీ రూపు మాకంటి కొలనులో…!!అల!!
సప్తగిరులన్నీ నీకు ఓ ఛత్రమై…
వృక్ష సంపదల నడుమ నీ నివాసమై…
అలమేలు మంగనొదిలి ఎట్లున్నవో…
స్వామీ..ఏకాకివై ఏ పాట్లు పడుతున్నవో…
శ్రీనివాసా…నీ దరికి రమ్మంటూ వేడెదము శ్రీలక్ష్మినీ…
మా వెంకన్న చింత తీర్చమని కోరెదము మా తల్లిని…!!అల!!
పాహిమాం పాహిమాం శ్రీ వేంకటేశాయ పాహిమాం… రక్షమాం రక్షమాం శ్రీనివాసాయ రక్షమాం…