ఎంత సుందరునివో నీవు సుందరేశా…
జగతికెంత భాగ్యమో నిను కనిన పార్వతీశా…
అరుణ కాంతులతో నీవు వెలుగొందుచుంటే…
కరుణ కిరణాలు మావైపు ప్రసరించుతుంటే…
ఏలయ్య మాకింక ఇక్కొక్క జన్మ…
ఈ జన్మ చాలంటూ చాటింది మా కనుల చెమ్మ…!!ఎంత!!
కరుణించెదవు నీవు విసిగించుకొనక…
మన్నించెదవు నీవు తప్పులను ఎంచక….
పాపాల చిట్టాలు చూడనే చూడవు…
పాలాభిషేకములకు మురిసిపోయేదవు….
నీ కన్న దయామయుడు ఏ దివిన కలడు…
నిను మించి ప్రేమించు దేవుడు ఎచ్చోట కలడు…!!ఎంత!!
భక్త సులభునివి నీవు భీమేశ్వరా…
దీన బంధువి నీవు ఘ్రుష్ణేశ్వరా..
రాకున్ననూ పలుక స్తోత్రాలు మాకు…
తెలియకున్ననూ మంత్రాలు వల్లించుటకు నీకు…
శివా…అని పిలిచితే చాలు తెరిచేవు కనులు…
రా హరా..అనినచో వస్తినని తట్టేవు భుజములు…!!ఎంత!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం…
రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్షమాం…