హే…బ్రహ్మాండ నాయకా…
తల్లి..హిమ పుత్రికా ప్రేమికా….
కనులు చెదెరేనయా నీ దివ్య సౌందర్యమును జూచి…
ఒడలు సాష్టాంగ పడునంది హృదయమును పరచి…
పరమేశ్వరా…ఎంత భాగ్యము నిచ్చావు నా కనులకు…
జగదీశ్వరా…ఏ నోము నోచెనని ఈ జన్మకు…!!హే!!
ఏ పాటివి శంకరా…నీకు వజ్రవైడూర్యాలు…
నీకు సరి సాటికావు ఆ పసిడి పగడాలు….
అనంత లోకాలచే శ్లాఘించబడు ఆదిదేవా…
నీ సహజ సౌందర్యమును మించి ఏముంది మహా దేవా….
ప్రణమిల్ల వలసినదే మైమరచి సురులైననూ….
ప్రస్తుతించవలసినదే నిను గాంచి బ్రహ్మ విష్ణువులైననూ…!!హే!!
మహేశ్వరా…అత్యద్భుత నిరాకార నిఖిలేశ్వరా….
సర్వేశ్వరా….నిత్య భస్మాభిషేక ప్రియ కాళేశ్వరా…
ఒసగుమయ్యా నాకు సాహితీ సంపదలు…
విరచించ నీ గీతాల గ్రంథ నిధులు…
యుగములెన్నైననూ తరగని యశము కలవాడా…
కరుణించి నను నీ వశము చేసుకో సాంబశివుడా…!!హే!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…