హే…శంకరా…చాలించు తండ్రీ నీ ఉగ్రరూపం…
ప్రభూ…కానలేమయ్య నీ భీకరాకారం..
మన్నించి శాంతించు శివ శంకరా…
కరుణించి రక్షించు గంగాధరా…
ప్రసన్నం…ప్రసన్నం…పరమేశ్
సుశాంతం… సుశోభితం…అమరేశ్వరా…!!హే!!
కైలాస వాసా వద్దయ్య ఆగ్రహం…
కారుణ్య హృదయా…శాంతించు శీఘ్రం…
అల్పులము ఆర్తితో అర్థించు చుంటిమి..
అపర భక్తితో నిను మేము వేడుకొనుచుంటిమి…
పార్వతీశా…ఇటు నిను కని మన కలుగునా ఈ భువనము…
శాంకరీశా…నిను వినా దిక్కెవరను ఈ లోకము…!!హే!!
వేల గొంతుకలతో స్తోత్రాలు వల్లింతుమయ్యా…
దివ్య మంగళ ఢమరుకములు మ్రోగింతుమయ్యా…
ఆస్వాదించి..సుగంధ భరిత పుష్ప పరిమళములను…
ఆరగించి…మధుర ఫల పాయసములను…
ప్రసన్నుడివి కావయ్య పరమేశ్వరా…
ప్రేమ స్వరూపమున దర్శనంబివ్వయ్య సర్వేశ్వరా…!!హే!!
పాహిమాం…పాహిమాం… పరమేశ్వరా…పాహిమాం….
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్ష మాం…