ఓం నమః శివాయ నమః
ఎపుడిస్తువని వరము నేనడగ శంకరా….
ప్రతి క్షణము నా నీడవై నీవుండ వరమడగ మూర్ఖమే కద ఈశ్వరా…
కాచేవు భక్తులను కనురెప్పవై…
తట్టి పిలిచేవు శివుడు కలడు మీకనుచూ కన తండ్రివై…!!ఎపు!!
మనసు నీ వశము చేయ ఏ వ్రతము చేయను….
నేను ఋషి గా మారి తరియించ ఏ నోము జరుపను…
కానరాకుంది కర్మఫలముల వలన ఏ మార్గమూ…
శంకరా…మది వేడుకొంటోంది కన్నీటి కనులతో ఎటువైపుకని నా పయనము…
జాలికలిగితే నీకు జంగమయ్య…
త్రోవ చూపరా నాకు శంకరయ్య ..!!ఎపు!!
ఎందుకో ఏమో గురుతుకొస్తుంటావు శంకరా…నిముష నిముషాన…
ఆ మోములో ఏముండునో ఏమో…అలా నిలిచి పోతావు ప్రతి మనసులోన…
జన్మ కడదాక నిను వీడి పోలేరు ఎవ్వరూ…
కట్ట కడదాక నీ తలపులో బ్రతికేరు అందరూ…
వరములా తలచేరు నీ మాయని….
గంగ సిరులు నిండిన కనులతో అడిగేరు ఇది ఏ జన్మ ఫలమని.. !!ఎపు!!
పాహిమాం….పాహిమాం….పరమేశ్
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…