శోభాయమానం శ్రీ కాళ లింగం…
పరమ పుణ్య ప్రదం కనిన ఓంకార రూపం…
మోక్ష ప్రదాయకం…శివలింగ దర్శనం..
అమిత ఆనంద దాయకం…శివుని నామాల స్మరణం…!!శోభా!!
చాలవయ శంకరా… ఎన్నైన జన్మలు…
చేయ…సరిపోవయా నీకు పూజలు,సేవలు…
ఏలవయా ఈశ్వరా…మా హృదయ సీమలు…
నీకు గుడి కట్టి కొలిచేము ప్రతి రేయి పవలు…
కొలువుండిపోతే మా మనసులోన…
కనిపించకుందువా శంకరా… మా కలలలోన…!!శోభా!!
వివిధ ఫల పుష్పాల నైవేద్యములతో…
స్వర సుధలు ఉప్పొంగు నీ గానములతో….
పరవశించెదము నీకు హారతులనిస్తూ…
పాహి…పాహి అనెదము నీదు చరణాలు తాకుతూ…
కరుణ సంపదలు చూసేము నీ కనులలో…
ప్రేమ చంద్ర కళలు చూసేము నీ నగుమోములో…!!శోభా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం..సర్వేశ్వరా రక్ష మాం…