కదలిరండు…కదలిరండు…కాత్యాయిని పతిని కనగ కదలిరండు…

ఓం నమః శివాయ నమః 

కదలిరండు…కదలిరండు…కాత్యాయిని పతిని కనగ కదలిరండు…
కొలవరండిక కొలవరండు..కైలాసగిరి పతినిమనసారా కొలవరండు..
సౌందర్య రూపాన నేడు సోమేశ్వరుండు…
కమనీయముగా నున్నాడు కానుకలనియ్యంగా కాళేశ్వరుండు…!!కదలి!!

కంటిరా…ముక్కంటి ఆ రెండు కనులను….
మన లోని దుర్గుణముల దహియింపనున్నట్లున్న ఆ అగ్ని శిఖలను…
అర్పించెదము భక్తితో మన హృదయము….
పరిశుద్దమవునట్లు పూర్తిగా మన దేహము…
సుందరుడు శుభకరుడు శంకరుడు నేడు…
తప్పులను మన్నించి కరుణించునట్లున్నాడు వేగ రండు….!!కదలి!!

శంకరా…గైకొనుము పలువిధ సుగంధ పుష్ప మాలా సరములు…
పరమేశ్వరా…ఇదే గైకొనుము పాలు ఫల నైవేద్యముల  పంచామృతాభిషేకములు…
శశిధరా….మా దగ్గరున్న ఒనరులింతేను కాదనుకురా…
గంగాధరా….ఇవి ఏ పాటివని దయవుంచి చిన బుచ్చుకోకురా…
కనుచూపుతో తాకరా…మా హృదయ తీరాలను…
లోన వినెదవు నీవు పంచాక్షరీ మంత్ర మధురిమలను…

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top