ఓం నమః శివాయ నమః
రారమ్మని నీ గుడికి పిలువుమయ్య శంకరా…
దీవింతును, కరుణింతునని రమ్మనరా ఈశ్వరా…
నిముషమైన నిలువమయ్య నీ పిలుపులు అందితే….
ఏ ఘడియనైన కదులుమయ్య ఆ భాగ్యము దొరికితే….!!రా!!
చెప్పవయా పరమ శివా ఏమి తేను పూజకి…
మనసు విప్పవయా.. సదా శివా ఏమవ్వను నీ సేవకి….
ఆనతిస్తె చాలు నేను అర్పించెద హృదయము…
నీవు కరుణ చూపితే చాలు నేను వదలనయ్య చరణము…!!రా!!
నిను గాంచునపుడు మూయవయ్య రెండు కనులు రెప్పలు ..
నీ సేవ చేయునపుడు అలుపు తెలియదంటు పలుకు రెండు కరములు….
ఈ తనువు నీది, మనసు నీది ఆనతిమ్ము శంకరా…
ఎన్ని జన్మలైన సేవ చేయు శక్తి నిమ్ము ఈశ్వరా…!!రా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…