ఓం నమః శివాయ నమః
దిగిరార..దిగిరార…గణపతి
దయకనగ దిగిరారా… దిగిరార గణపతి….
పూజలను చేశాము ఈ సంధ్యవేళ…
దీవెనల నివ్వంగ జాగు నీకేల… గణపతీ పప్పా మోరియా…మోరియా…
జై గణపతీ పప్పా మోరియా…మోరియా…!! దిగిరార!!
తొలగేనయా విఘ్నములు ఎన్నున్ననూ….
వైదొలగేనయా కష్టములు ఏవైననూ…
నిను కొలుచు కొలదీ దగ్గరయ్యేవు మా మనసుకి…
దగ్గరయ్యేకొలదీ పెరిగేను నీ పైని భక్తి కొండంత ఎత్తుకి….
ఉచ్చిష్ఠ గణనాధా కరుణ చూపు….
వర సిద్ది వినాయకా దయను చూపు….!!దిగిరార!!
వక్రతుండమే వరమాయే నీరూపు కి…
ఏక దంతమే సొబగాయే నీ మోముకి….
సూక్ష్మ నేత్రాలతో తిలకించు గణనాయక….
శూర్ప కర్ణములు సారించి వినవయ్య మా వెతలు శుభదాయక…
మహా కాళ ప్రియ గణేశాయ పాహిమాం….పాహిమాం..
మహా శివుని వర గజముఖ వదనాయా రక్షమాం…రక్షమాం..!! దిగిరార!!