శంకరా…జగమేలు దొరవయ్య దొరవు నీవు…

ఓం నమః శివాయ నమః 

శంకరా…జగమేలు దొరవయ్య దొరవు నీవు…
ఈశ్వరా… మాలోన కలవయ్య కలవు మా కలవు నీవు…
పాలించరా జగతిని నీ కనుచూపుతో…
పరి పాలించరా భువిని నీ నగుమోముతో…!!శంకరా!!

మా హృదయ సామ్రాజ్యమునకు అధిపతివి నీవు…
జాలి చూపేటి జగపతీ…ప్రేమ సుగుణాల పశుపతివి నీవు…
నీ సుపరిపాలనా నీడలలో చల్లంగా మనగలుగుతున్నాము…
మా హృదయాంతరంగమున జ్యోతిలా నిను కనగలుగుతున్నాము..
చాలునయ్యా చాలు …ఈ వరము ఈ జన్మకి….
నేనొక పువ్వునైనా, ఫలమునైనా చాలు నీ పద పూజసేవకి…!!శంకరా!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా...పాహిమాం
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top