ఎలుక వాహనమెక్కి రావయ్య వేగిరాన…

ఓం నమః శివాయ నమః 

ఎలుక వాహనమెక్కి రావయ్య వేగిరాన…
నిను కొలువ వున్నాము పార్వతీ నందనా….
పాల వెల్లిని కట్టి సిద్ధముగ నున్నాము…
పత్రి తదితరములతో పూజించ వేచివున్నాము…
అందుకొన రావయ్య మా పూజలు…
పొందకోరితిమయ్య ఆశీస్సులు…
గం గం గణేశాయ శ్రీ గణేశాయ…
జై జై గణేశాయ..జయ గణేశాయ…!!ఎలుక!!

నవ్వాడని చంద్రునికి శాపమిచ్చావు…
చవితిన చూసాడని కృష్ణుని నిందకు మూలమయ్యావు….
ఆ నిందయే వరమాయే కన్నయ్యకి…
అరవింద జాంబవతితో పెళ్లాయే గోపయ్యకి…!!ఎలుక!!

లోక కల్యాణం కొరకు ఉద్భవించావు…
వరసిద్దుడను నామమును నిలుపుకున్నావు…
గణపతీ రావయ్య ప్రతి ఇంటి గడపకు….
తల్లి పార్వతి నడిగి (paaravhi parameswarulatho kalisi) దీవించ ప్రతి పల్లెకు…!!ఎలుక!!

పాహిమాం…పాహిమాం.. గణాధిపా  పాహిమాం..
రక్షమాం…రక్షమాం…శూర్పకర్ణా  రక్షమాం…

Leave a Comment

Scroll to Top