ఓం నమః శివాయ నమః
వెళ్లాలనిపించునా శంకరా…మా ఇంటికి…
నిను కనగ వచ్చాక గుడిలోనికి…
త్రిదళమునై చేరాలనుంటే నీ పాదాల చెంత….
మదిని గుడిగా చేసి చేయాలనివుంది సేవ మేరునగమంత…!!వెళ్ళా!!
పేరుకే శంకరా….రక్త సంబంధాలు…
వెంటరావయ్య ఈశ్వరా…ఏ పేగు బంధాలు…
పిలుచుకునేందుకే ఆ వావి వరసలు…
ఏ మనిషిలో కనబడవు నిజమైన ప్రేమలు…
ఎట్లుండగలను శంకరా…ఈ భవ సాగరమున..
తెరచాప లేని నావనై ఈ జీవన నడి సంద్రంబున…!! వెళ్ళ!!
అలల తాకిడికి మా నావ ఉలికి పడునేమో…
నీ కరుణ కరువైన పడవ పడి లేచునేమో…
చుక్కానివై చక్కద్దిద్దయ్య మా జీవితం…
మాకు దిక్కైన శంకరా..మా మదిని చేయమా నీకంకితం…!!వెళ్ళ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా.
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…