నారాయణీ….శ్రీ పరమ పావనీ..

ఓం నమః శివాయ నమః 

నారాయణీ….శ్రీ పరమ పావనీ..
దాక్షాయణి…దయా హృదయ మాలిని…
ఆశ్వయుజ మాసాన అమ్మ.. ఓ..మాయమ్మ…
అందుకొని పూజలను వరములివ రావమ్మా…!!నారాయణీ!!

అమ్మా..భవానీ కనవమ్మ కనవే…
తల్లీ…శివానీ…వినవమ్మ వినవే…
పాడుతూ పాటలను నిను మ్రొక్కగా…
ఆడుతూ నాట్యములను మయూరములుగా…
జనులెల్ల కదిలారు నిను దర్శించు కొరకు….
నీ కనుసనలలో మెలగు భక్తులు నిను కొలుచు కొరకు…!! నారా!!

అంగరంగ వైభవముగా నీ పండుగను జరుపుతుంటే..
ఆలయాలన్నీ పరిపూర్ణముగ నిండి వుంటే…
ఆలరారుచున్నావు తల్లి…దివ్య శోభతో గర్భాలయాన….
కొలువు తీరావు జననీ…బంగారు తల్లి వై మా హృదయాలయాన…
ఆనంద మాయేను అనురాగ వల్లి…
కనుల ఆనంద భాష్పాలు రాలే కల్పవల్లి….!!నారా!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా...పాహిమాం…
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా
రక్షమాం..

Leave a Comment

Scroll to Top