ఓం నమః శివాయ నమః
ఓం నమః శివాయ శివశంకరా…
మహా దేవాయ గంగాధరా..
ప్రణవాక్షర రూపాయ పరమేశ్వరా…
నిటలాక్ష స్వరూపాయ నగరేశ్వరా…
కంటిరా ముక్కంటి నీ దివ్య రూపము….
నేనంటిరా శరణంటు తాకి నీ పరమ పాదము ..!!ఓం!!
పలికించు శంకరా…మానోట నీ నామ మధురిమలు….
వికసించ మాలోన సుమములై నీ భక్తి వనములు…
అర్చకుని నేనై చేతునయా పూజలు…
భిక్షకుని నేనై యాచింతునయా వరములు…
దయగల శంకరుడు ధర్మాత్ముడందురు…
పాప కర్మముల కొనిపోవు పరమాత్ముడందురు.!!ఓం!!
పడ్డాక భూమిపై తప్పనివి ఈ కర్మలు…
మనిషిగా పుట్టాక తెంచుకొనలేనివి బంధనాలు…
జననాలు మరణాలు సహజమని తెలిసినా…
ఏనాటికైనా ఈ తనువు మట్టి పాలేనని ఎరిగినా…
ఆశ చావని జన్మలు కోట్లలో ఇల పైన….
మోక్ష సాధనకు తుదకు ధ్యాస పెట్టనోళ్ళే ఎవ్వరైనా…
మన్నించరా శంకరా….ఈ మానవాళిని….
దారి మళ్లించి కావరా వెలిగించి నీ జ్ఞాన జ్యోతిని…!!ఓం!!
పాహిమాం…పాహిమాం….పరమేశ్వరా
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్ష మాం…