ఓం నమః శివాయ నమః
నిలువగల వారమా నీ ఎదుట శంకరా….
నిలిచి వరమిమ్మని అడగ గలవారమా ఈశ్వరా…
దయతలచి ఇవ్వాలి నీకు నీవే వరములను….
మమ్ములను కరుణించి ఒసగాలి నీ దర్శనములను…!!నిలువ!!
మనసారా నిను కొలవని ఈ హృదయము ఎందుకు….
తనివి తీరా నీ సేవ చేయని ఈ దేహమెందుకు….
ప్రాణమున్నా లేనట్లుగా వుంది మా జీవితం…
పరమేశ్వరా… శలవియ్యరా ఏ రీతి చేయ నా మదిని నీకంకితం….!!నిలువ!!
ఐహిక సౌఖ్యములను అనుభవించ ఇచ్చావటయ్యా ఈ జన్మను…
నీ కరుణ కరువై ఈ జన్మ చేసుకొనే ప్రారబ్ధ కర్మలను…
ఆశా మోహాల సుడిగుండములలోన…
నిరాశా నిస్పృహల నడి సాగరాన…
కొట్టు మిట్టాడుతోంది ఈ ప్రాణము కనిపించక గమ్యము…
నీ చరణాలు పట్టి వేడుకొన ఆరాటపడుతోంది అలుపెరగక ఈ జీవము….!!నిలువ!!
పాహిమాం.. పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…