ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఎంత భాగ్యమిచ్చావయా శంకరా…సర్పానికి..
నీ కంఠాన చేరి తిరుగాడు మిన్నాగుకి…
ఊహకే అందవు పరమేశ్వరా నీ లీలలు…
చెప్పుకొనగ చాలవు జగదీశ్వరా.. ఎన్నైనా రేపవలు…!!ఎంత!!
ప్రతిక్షణము నీతోనే ఉంటూ…
అప్రతిహాతముగ నిను సేవించుకుంటూ…
అమరింది అవయవమై అమరమై నీ తోటి జతగా…
తాను పొందింది పూజలను నీతోటి సమముగా…
దొరకునా ఏ ప్రాణికైన ఇంత భాగ్యము…
నీ సన్నిహితముగ చేరు పొందు యోగ్యము…!! ఎంత!!
ప్రాణమున్న ఏ ప్రాణినైనా కరుణిస్తవంట…
ప్రాణమునే ఫణముగా పెట్టువారికి వరమిస్తువంట…
జాతి,మత,కుల, జంతు బేధములను అసలెరుగవంట…
జాలి గల హృదయాలలో నివసిస్తువంట..
ఈతిబాధలలో మునిగి “ఈశ్వరా” దిక్కు నువ్వేనంటే దిగి వస్తువంట…
ముందెనక యోచించిక ముదముతో భుజము తడిమి తోడుందువంట…
పాహిమామ్..పాహిమామ్..లోకపాలకా..
ఎంత దయనో మాపైన నీకు… చెప్పనలవి కాదు మాకిక…