ఏ తీరున తెలిపేను శంకరా… నీకు నేను కృతజ్ఞతలు..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఏ తీరున తెలిపేను శంకరా… నీకు నేను కృతజ్ఞతలు..
ఏడాదిగా ఏకధాటిగా నాచేత వ్రాయించినావు నీ భక్తి పద కవితలు..
ధన్యోస్మి శంకరా…ధన్యోస్మి…
కైలాస వాసా..నీవేనయా శివా… నా కైవల్య కలిమి…

నిలకడగా నిను నేను ఏనాడూ ప్రార్ధించలేదు…
మనుగడలో మునిగి ఏనాడు నిను నేను సావధానముగ ధ్యానించలేదు…
క్షంతవ్యుడిని శంకరా…క్షంతవ్యుడని…
సుమనసుతో మన్నించు కాళేశ్వరా ఈ సూర్యనారాయణుడిని…
నా జీవన గమనం లో కలనైన  ఉహించని మలుపుతో వరమునిచ్చావు..
నా చేయిపట్టుకొని నీ వచన కవితలు వ్రాయించుకొని వెలలేని
ఆధ్యాత్మిక  సంపద నిచ్చావు…


మూడు వందలా అరవై అయిదు వత్తులతో అఖండ దీపమును వెలిగింతురెందరో నీకు….
మూడు వందలా అరవై అయిదు పదకవితల సంపుటిని అర్పించినాను నేను నీకు…
పదదోషములెంచకు పరమేశ్వరా…
ఆర్తితో వ్రాసిన అక్షరసుమమాలలో సర్వేశ్వరా…
నీ లీలలే స్ఫూర్తిగా కలము కదిపి వ్రాశాక నేను…
ఎందరో పఠించి మనసారా నిను తలచారు.. ఇక నా జన్మకు ఇంకేమి నేను కోరేను…

Leave a Comment

Scroll to Top