ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఉజ్జయినీ పుర నివాస పుణ్య జనులారా…
కాళేశ్వరుని గుడి ప్రాంతము న నిరీక్షించు భక్త జనులారా…
దర్శించినారా ధవళ వర్ణ వస్త్రధర దీన దయాళుని నేడు…
పరికించినారా కాళ లింగమున పరకాయ ప్రవేశము చేసిన పరమేశ్వరుని సుందర రూపమును నేడు…!!ఉజ్జయిని!!
కమల నయనాల చూపుతో మీ రాకనే కాంక్షించు చున్నాడు శివుడు…
ప్రేమ పలుకుల అధరాలతో మిమ్ము ఆహ్వానించుచున్నాడు హరుడు..
కరుణామయునికి కూతవేటు దూరములోనున్నట్టి కాళేశ్వరుని క్షేత్రప్రియ భక్తులారా…
తెమలండి తొందరగా త్రినయుని దీవెనలు పొందంగ దర్శించుకొని మీ రెండు కనులారా…!!ఉజ్జయిని!!
దూరానా ఉన్నాము కోట్లాది భక్తజనులము మేమందరం…
కాళేశ్వరుని కనగ తక్షణము కదలి రాలేము తుదకెవ్వరం..
విన్నవించుకుంటున్నాము మీకు..ప్రార్ధించమని మా కొరకు శ్రీ మహాకాళేశ్వరుని..
కడకు కలనైన కనిపించి కరుణించి కడతేర్చమని మా జన్మనీ…
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్..
మా ప్రార్ధనలు మన్నించి దర్శనంబియ్యరా శివశంకరా…