ఓమ్ నమ:శ్శివాయ నమ:


చూడ రారండి జనులారా సాంబశివ మూర్తినీ..
కనగ రారండి హిమగీరీశుని చల్లనీచూపునీ…
కదలి పోలేము మనమెవ్వరము తన ఎదుట నిలిచి…
రెండు కరములూ జోడించి బొమ్మలై నిలిచేము మనసారా కొలిచి…!!చూడ!!
చెప్పెదము నిజముగా పరమేశ్వరునికి..మరచిపోగలము సుందరేశా నిను గాంచి ఎన్ని కష్టములనైనా అని…
మనసు విప్పెదము సత్యముగా…సర్వేశ్వరా నీ దయ లేకున్న బ్రతుకగల వారమా ఇన్ని నాళ్ళైనా అని…
అడుగడుగునా ఆదుకుంటూనే ఉంటావని..
తప్పటడుగు పడినపుడు భుజము తడుతుంటావని…
అడిగెదము మనము..ఇంతలా ప్రేమించు ఈశ్వరా..ఏమివ్వగలవారము నీకు మేమని…
విన్నవించెదము మనము..కొండంత భక్తి శ్రద్ధలతో శలవియ్యరా హరహరా ఏం చేయాలో మేమని…
మన పిచ్చిగాని..ఇవ్వగలవారమా మనము ఆ పుణ్యపురుషునికి…
గరిటెడు గంగను శిరము పై పోస్తేనే చాలనుకునే గంగాధరునికి…
ఇవ్వగలిగినదొక్కటే మనము పవిత్ర హృదయముతో ప్రార్ధించడమే తననీ..
చేయగలిగినదోక్కటే మనము.. తను పరవశించి కురిపించునట్లు వరముల విరి వానని…
పాహిమామ్..పాహిమామ్..శివశంకరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్…