తోచదాయె శంకరా…క్షణమైనా నిను తలవక..

ఓం నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

తోచదాయె శంకరా…క్షణమైనా నిను తలవక..
పొద్దుగడవదాయె హరహరా ఒక పూటైనా నిను కొలవక…
మాటే విననంటుంది శివా..ఎంత చెప్పినా నా మది…
నీ సేవే పరమార్ధమంది మొండికేసి తుదకది…!!తోచ!!

విప్పారిన నీ కన్నులు వీక్షిస్తుంటే విశ్వమును…
ఆ కనుపాపల కిరణాలు ప్రసరించుతుంటే వెలుగులను…
తొలగిపోవు కదా  శివా కమ్ముకున్న కరి మబ్బుల చీకట్లు…
తోక ముడిచి పారిపోవు కదా శివా  ఇబ్బడి ముబ్బడిగా నున్న ఇలలోని ఇక్కట్లు…!!తోచ!!

అంతుబట్టని ఆర్ధ్రతేదో మా కళ్లలో వుంది కానరా…
రవ్వంత దృష్టిపెట్టి చదవమని నీ నిండు మనసుకి చెప్పరా…
నిర్మలముగ సాగనివ్వు మా నిత్య జీవితం..
ధర్మకార్యములను ఆచరిస్తూ గడిపెదము మా శేషజీవితం…

పాహిమామ్..పాహిమామ్..శంకరా..
పరమ పావనమయ్యయి నిను దర్శించిన మా కన్నులు  అభయంకరా…

Leave a Comment

Scroll to Top