ఓమ్ నమ:శ్శివాయ నమ:


కనినంతనే కలుగు శుభములన్నట్లు..
అడిగినంతనే వరము నొసగునున్నట్లు..
ఎంత వైభవముగ నున్నావురా గంగాధరా..
హరిత మారేడు దళ హారా ధరా…!!కని!!
ఉమా మహేశ్వరా…దర్శించుకొని మురిసి పోయేరు జనులెల్ల ఏ వయో బేధ మెరుగక…
మహా కాళేశ్వరా…వర్ణించగలరా నేడు నీ అలంకారమును చూసి ఏ పండితులైనా జనకా…
తపము చేసిన మునులకే దొరకనంత భాగ్యమై..
తనువు ఉన్నన్నాళ్ళు చెరిగిపోని దృశ్యమై..
చిరకాల చిత్రమై మదిలోన నిలిచిపోయావు..
అచిరకాలములోనే నీ మదిని గెలవంగ అవకాశమిచ్చావు…!!కని!!
సురులారా వదలిరండి వేగిరముగ దివిని…
కనులారా కనగ కమనీయముగ నున్న హరుని…
మంగళ వాయిద్యాల నడుమ మంత్ర పుష్పాలను పఠించండి..
మంత్రోచ్చారణలతో మహి మారుమ్రోగి పోయేలా మాహేశ్వరుని స్తుతించండి..
కష్టాలు,కన్నీళ్ళు తొలగిపోవాలి ఈ పుడమి లో…
చిరునవ్వుల సంతోష కుసుమాలు విరబూయాలి ఈ భూమిలో..
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరాయ పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా