ఓం నమశ్శివాయనమ:🙏🙏🙏

దర్శించుకొను వేళాయె శంకరా..
తీయరా తలుపులను బిరబిరా…
అని ఆశగా ఎదురు చూస్తుంది ప్రతిరోజు మా హృదయము..
నీ నామమే ఉఛ్ఛ్వాస   నిశ్వాసములై పలికించు శివ శబ్ద నిలయము…!!దర్శించు!!

ఆతృతగ వుంటుంది ప్రతిదినము కాళేశ్వరా…
ఏ తీరులో ఇత్తువు మాకు నీ దివ్య దర్శనమని….
దర్శించినంతనే తెలిసేను విశ్వేశ్వరా..
అది నువ్వు మాకిచ్చు పుణ్యాల బహుమానమని…!!దర్శించు!!

తొలగిపోవాలని మా సంకటములు..
మా కోసమై చేయు నీ ప్రయత్నములు…
తలచుకుంటే చాలు పొంగేనయా తన్మయత్వముతో మా కంట గంగ..
ఆనతియ్యరా శివా మాకు ఒకసారి తనివి తీరా ఆర్థితో నీ పాదాలు కడగంగ…

పాహిమామ్…పాహిమామ్..శివశంకరా...
రక్షమామ్..రక్షమామ్..అభయంకర