ఓం నమ:శ్శివాయ నమ:


కనలేదు నేనెపుడు శంకరా…
చేయగా నీకిన్ని రూపములు..
వినలేదు కూడా నేను హరహరా..
చేస్తారని నీకిన్ని విభిన్న అలంకారములు..
ఎంత భాగ్యమయా నిను చూడ ఉజ్జయినీ పురవాసా..
కారుణ్యమయ హృదయ కైలాస వాసా…!!కన!!
పుట్టించినావా భువిపైన దివ్యభావాలు ఉప్పొంగు రీతిలో నిను తీర్చుటకు ఉలితోటి పనిలేని శిల్పులను…
పొందారు కదా వారు వరముగా పుట్టుకతోనే ముని వేళ్ళతోనే ప్రతిరోజూ నిను తీర్చు పరమ పద కళలను…
మా లోన భక్తి భావనలు పెంచాలనీ..
మమ్ము సన్మార్గమున నడిపించాలనీ..
మా పైన చూపించు నీ ప్రేమ ఎంత అద్భుతమయా…
చేస్తున్నాము ప్రతిన…కడదాక ఈ జీవితము నీకంకితమయా…!!కన!!
ప్రార్ధించుచున్నాను కాళేశ్వరా…
దర్శించు భాగ్యమివ్వు ధరణిపై జనులందరికీ ఉజ్జయినీపురమునకు వచ్చి..
ఉవ్విళ్ళూరూరేరయా వారు…ఎపుడెపుడెత్తువో మళ్ళీ ఆ భాగ్యమని అని ఒకసారి దర్శించుకొని వచ్చి…
ఏంచెస్తవో ఏమో నిను స్మరించు కొన వస్తే…
నీ మాయలో పడకుండరా శివా ఎవరైన నువ్వు కట్టి పడేస్తే…
పాహిమామ్..పాహిమామ్..శివశంకరా..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్..