నవమి నాటి శంకరా…పున్నమి కళల హరహరా…

నవమి నాటి శంకరా…పున్నమి కళల హరహరా…
పానకాలు తాగరా..పండగేళ పరవశించి మమ్ము కావ శుభకరా…

కడు బోయవాడు తిన్నడు తన కనులనిచ్చి నీ కరుణ పొందే మహేశ్వరా…
రఘురాముడే పూజించగా ఇలన వెలిసిన క్షేత్రమే రామేశ్వరమయ్యను ఈశ్వరా…
ఏమి చేయము మేము..ఎటులైన నీ కరుణ పొందగా మేము…
పాలుపోక ప్రతి దినము…ప్రార్ధనలతో సరిపెట్టుకుందుము….
నీ మదికి దగ్గరవగా మేము..మాకు ఏ దారి దగ్గరో చెప్పరా శివా…
నీ పైనే గురి కుదరగా మాకు…
మేము ఏ గురువు నడగవలెనో చెప్పరా శివా…
శిష్యులైపోతాము వెంటనే…
నిష్ట తో నిను కొలువ నీ ఇష్ట శిశువులై పోతాము వెను వెంటనే….

పాహిమాం..పాహిమాం…శివ శంకరా..
కోదండ రాముని జన్మ దినమున కోటి సంతోషముల నియ్యవయా శంకరా…

Leave a Comment

Scroll to Top