ఓంనమఃశ్సివాయనామ:


కనరండి…కనరండి…ఈ సంధ్య వేళ ఓంకార రూపుని…
మన కలలు పండించు కాత్యాయినీ పతి ప్రేమ స్వరూపుని…
తేరండి…తేరండి…క్షీర భాండాలు…
తెమలండి తొందరగ చేయ అభిషేకాలు…
సింధూర నామాల శివలింగ దర్శనం చేసుకుందాము…
సత్కర్మ పుణ్యాలు ఈ సందర్శనము తో అందుకుందాము…
భేదభావములిడిచి భక్తి భావము తో వచ్చి…
భవభంధములను మరచి భగవంతుని మనసార కొలిచి…
తన సేవలో మిళితమవనిస్తే మన మనసుని….
తన ధ్యాసలో కలిసి పోనిస్తే మన శ్వాసని…
మెలమెల్లగా మన అంతరాత్మ లో చూడమా తన జ్యోతిని….
వెలుగొందనీయమా..మన హృదయ సీమ లో నిత్యమూ ఆ దివ్య పరం జ్యోతిని….
పాహిమాం..పాహిమాం..శంకరా…
రక్షమాం..రక్షమాం…అభయంకరా..