ఏ భావమిత్తువో విప్రులకి…

ఏ భావమిత్తువో విప్రులకి…
ఆ రీతినే తీర్చేరు దర్శించగా మా కనులకి…
ఏ యోగమిత్తువో వారికి….
అనుదినము నీ లింగార్చన గావించు జన్మలకి….

అటు ఇటు తిప్పక కనుపాప లతో నిను దర్శించగ మేము…
ఎన్ని తిప్పలో పాపము వారికి తీర్చునపుడు నీ దివ్య రూపము…
మరచిపోతారు శ్రమను…
నిను దర్శించిన క్షణమున మా కనులలో కాన్పించు భక్త్యానందము చూసి…
తడుముకుంటారు తమను..
మైమరచిన క్షణమున ఈ కరములేనా  నిను తీర్చిన పుణ్యకరములని తెలిసి…
లిప్త కాలమున స్తబ్ధులవుదురు వారు…
ఎంత కాలమైన సేవించగ సన్నద్దులవుదురు వారు…
రోజుకొక రూపమున నిను మాకు సాక్షాత్కరింపజేస్తున్న రుత్వికులని..
ధీర్గాయుషునిచ్చి దీవించరా శివా..ఈ కలియుగ అపర బ్రహ్మలని…

పాహిమాం…పాహిమాం..శంకరా…
రక్షమాం..రక్షమాం..అభయంకరా…

Leave a Comment

Scroll to Top