ఎలా కొలిచితే చూపేవు నీ కరుణని…

ఎలా కొలిచితే చూపేవు నీ కరుణని…
నిన్నెలా తలచితే చూపే వు నాపైన దయని…
పువ్వుంచి కొలిచాను శంకరా…
చరణాల ఫలముంచి తలచాను ఈశ్వరా…
కరగదా నీ మనసు కాశీపతి…
కరిగిచూపద జాలి గౌరీ పతి..!! ఎలా!!

అపర దయామాయుడవని కీర్తించు మునులు….
పరమ ప్రేమ స్వరూపునివని శ్లాఘించు సురులు…
గత జన్మ పాపాల లోపాల వలనో…
నిను మరచులా చేసిన ఏ కర్మ వలనో…
పొందనైతిని నీ దయను పరమేశ్వరా…
ఇది వంద శాతము నా తప్పు శివ శంకరా…!!ఎలా!!

పరిశుద్ధ మనసుతో పూజించనుంటిని….
సమృద్ధిగా సేవలను నే చేయనుంటిని…
కర్మ జీవునిపైన కనికరము చూపవా..
జన్మ ధన్యమగు మార్గమును ఇకనైన తెలుపవా…
విశ్వేశ్వరా…వినిపించుకో నివేదనల గ్రంథము…
సర్వేశ్వరా…అందుకో భక్తి పరిపూర్ణ హృదయము…!!ఎలా!!

పాహిమాం…పాహిమాం….పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top