కాళేశుని గుడిలోన రామనవమి పండుగ…
ఆ రాములోరి కనగ రా రండి రండి దండిగా…
అవంతిక పురమాయే అయోధ్యా నగరిగా…
ఆ ఉజ్జయినీ పురమాయే ఉత్సవాల పురముగా…!!కా!!
రండి రండి కొలిచెదము శ్రీ రామ మూర్తిని…
వేగ రండి రండి మొక్కెదము కోదండ రామ రూపుని…
ఈశుడైన రాముడైన ఒక్కటేనట…
వారిద్దరూ ఒక్కటై దీవించుతారట…!!కా!!
సీతమ్మ పతిని కంటిమంటూ శివుని కొలవరే….
కౌసల్య తనయ ప్రేమ మూర్తి గీతాలు చదవరే…
దాటి పోతే ఈ క్షణము మరల రానిది..
దండ మెట్టుకుంటే ఈ భాగ్యం మరువ రానిది…!!కా!!
పాహిమాం..పాహిమాం రామచంద్ర పాహిమాం…రక్ష మాం…రక్ష మాం..సాంబ మూర్తి రక్ష మాం…