వినిపించ తగు సమయమేనా?
మా గాథ వివరించ ఇది తరుణమేనా?
శంకరా…తెలుపుమయ్యా వినిపింతు వేదనలని…
పరమేశ్వరా…తొలగించు మాకున్న కష్టాలని…!!వి!!
చిత్రాతి చిత్రములు మా నుదుటి రాతలు….
భలే చిత్రముగ నుండయ్య నీ వింత లీలలు….
ఒకనాటి పాపాల మా పూర్వ కర్మలు…
మాచేత చేయిస్తువున్నాయి ఎన్నెన్నో తప్పులు…
మన్నించి కరుణించు శివశంకరా…
నీ పైన ధ్యాసుంచి బ్రతికెదము గంగాధరా…!!వి!!
వినగలుగు రాగమేదో తెలుపవయ్య..
ఆ రాగాన వినిపింతు వేదనలని శంకరయ్య…
నిన్ను కనగలుగు దారేదో చూపవయ్య…
ఆ మార్గాన పయనించు వరమొకటి మా కివ్వుమయ్య….
శివా..మా గాథ తెలుపుకొననివ్వు…
సదా నీ స్మరణ మా మనసులో చేసుకొననివ్వు….!!వి!!
పాహిమాం…పాహిమాం ..శివశంకర పాహిమాం…రక్ష మాం…రక్ష మాం..సర్వేశ్వరా రక్ష మాం….