తిరునామాలంకృత కాళేశ్వరుని దర్శనం…
త్రిజన్మల పాప సంహార శంకరుని వీక్షణం…
పొందితే కరుగునిక పాపాల శిలలు…
పూజించితే శివ భక్తునిగ నీవు చరితలో మిగులు…!!తి!!
మనని కరుణించుటకు శివుడు వెతుకునట మార్గాలు వేలు…
భక్తి సంద్రాన ముంప తాను అవతరించునట లక్ష సార్లు….
ప్రయాస పడడు శంకరుడు దర్శనంబియ్య…
మన పైన ధ్యాస పెంచుకొనును ఈశ్వరుడు కాపు కాయ….
ఏమివ్వకున్ననూ మనము శంకరునికి…
మనకు అన్ని తానేనవునను ఏ నాటికి…!! తి!!
త్రినేత్ర వీక్షకుడు పరమశివుడు…
త్రియాయుధాధరుడు సాంబ శివుడు…
మూడుకనులతో వీక్షించు శివుడు లోకాలని…
మూడు శూలములతో రక్షింపబడు తన చేత అవని…
జన్మనిచ్చిన శివుని మరచినా మనము…
జన్మ కడదాక కాపుకాచే హరుని మనసెంత ఘనము…!! తి!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం