శివా…నా లోకం నీవేనయా…
సదా…ఈ ప్రాణం నీదేనయా..
ప్రభూ…సకలం నీవేనయా…
హే శివా…సమస్తం నీవేనయా..
నాదంటూ ఏముంది ఈ జగమున…
నీ దయవుంటేనే నేనుండు ఈ పుడమిన…!!శివా!!
గాలి నీవై నేను బ్రతుకు చున్నాను..
జాలి చూపావుకనుకనే ఇలన వున్నాను…
స్వరము నీవై నేను పలుకుచున్నాను..
కరుణ చూపావు కనుకనే కనులతో చూచుచున్నాను…
అంకితము చేసినా నా జన్మను…
తీర్చగలనా శంకరా…నేను నీ ఋణ మును…!!శివా!!
ఏ సేవ చేసి నిను నేను మెప్పించగలను…
ఏ నోము నోచి నీ కరుణ నే పొందగలను…
దయా గుణ శీలీ…శలవిస్తే తీర్చేదను నా మొక్కులు…
వర వితరణ శీలీ…కరుణిస్తే అర్పించెదను నా ముడుపులు…
అందుకొని అందిస్తే ఆశీస్సులు….
శివా…చూసేవు నాలోన నీ ఉషస్సులు…!!శివా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం….సర్వేశ్వరా రక్ష మాం…