శంకరా…నీ రూపు మదిలోన నిలుపవా…
ఈశ్వరా…ఆ చూపు నాలోన కలుపవా…
నిను కనిన ఈ కనులు వేడు కొనుచున్నవి….
తమ లోన నిలుపుకొన కడు పరితపిస్తున్నవి…!!శంకరా!!
ఏ కనులు చూసినా వేడుకొను నిన్ను….
భక్తితో కీర్తనలు పాడుతూ అలరించు నిన్ను….
కారుణ్య మూర్తివై కనులముందుంటే…
మా గుండె గుడి చేయమా శంకరా… నువ్వొస్తునంటే…
విడిచి పెడుతూ మేము రాగ బంధాలు….
గుడికొచ్చి చేసేయమా నీకు పాల అభిషేకాలు…!!శంకరా!!
కోట్లాది భక్తులు పొగడదగ రూపము…
ముక్కోటి దేవతలు కొలువు వుండు హృదయము…
అసమాన తేజం…నీ మందహాసం…
శంకరా…అద్వితీయం…అమోఘం..నీ దివ్య దర్శనం…
మా జన్మ కుసుమమైతే చాలు నీ పూజకి…
అది ఒక బిల్వ దళమైనా చాలు నీ పద సేవకి…!!శంకరా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్షమాం…