ఏమని నిన్నడగను….
ఏంకావాలని కోరను…
ఇచ్చావు అన్నీ నేనడగకుండనే…
కరుణ చూపావు శంకరా… నే కోరకుండనే…
శంభో హర శంకరా…నీ దయకంతేదిరా…
గంగాధర ఈశ్వరా…నీ ప్రేమకు హద్దేదిరా…!!ఏమని!!
ఇన్నాళ్లు చూపలేదు కాస్తైనా భక్తి నీపై…
నేనేనాడు పెట్టలేదు ధ్యాస కూడ నీపై…
అయినా కరుణించినావు సోమశేఖరా…
నీ ప్రేమ ఎంత గొప్పదిరా చంద్ర శేఖరా…
శంభో హర శంకరా…నీ లీల లేరుగలేముర…
గంగాధర ఈశ్వరా…ఆ మాయ మర్మమేందిరా…!!ఏమని!!
ఇస్తుమంటే పాలు,తేనె అన్నీ నీవాయే…
మరి తెస్తుమంటే పూలు, పండ్లు అవియూ నీవాయే…
నీది కానిది ఏది లేదని తెలుసుకుంటిరా…
ఏమివ్వలేక చేతులెత్తి దండ మెడితిరా..
చేయగలను శంకరా ..ఈ జన్మకు నీ ఊడిగం….
ఇవ్వగలను శంకరా…నా మనసే నీకంకితం…
కాదనకా స్వీకరించు మల్లికార్జునా…
మనవి మన్నించి కనికరించు నాగభూషణా…!!ఏమని!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…