రండి రారండి భక్తులారా…

రండి రారండి భక్తులారా…
ముక్కంటి వైభవమును కన రారండి మాన్యులారా…
ప్రేమ స్వరూపుడై శివుడు కొలువు తీరాడు…
వరములియ్యంగ ఎదురు చూచుచున్నాడు…
మనసారా కని సేద తీర రారండి…
మహేశ్వరుని కరుణ పొంద వేగ రారండి…!!రండి!!

అదిగదిగో అల్లదే ఉజ్జయిని పురము…
భక్త జనులకదే భువిన కైలాసము…
ఆ కనిపించునదే శివుని ప్రతి రూపము…
శివా..మన్నించరా అనిన తొలగు మన పాపము…
మన్నించుటకే శివుడు మహిన వెలిశాడు…
కర్మలను తప్పించుటకే లింగమై  కరుణ చూపాడు…!!రండి!!

పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేసి…
నుదిటిపై కాసింత విభూతి రాసి…
ఒక చేతిలో జలము…
ఒక చేతిలో దళము…
కొని పోయి కొలిచెదము కాళేశుని…
చరణాల పూలుంచి తెలిపెదము కృతజ్ఞతలని…!!రండి!!

పాహిమాం..పాహిమాం…పాహిమాం…అంటూ… కోరెదము శివుని రక్షించమంటూ…

Leave a Comment

Scroll to Top