జంగమా… జగదేక చక్రవర్తి…

జంగమా… జగదేక చక్రవర్తి…
కాళ లింగమా…కారుణ్య హృదయ మూర్తీ….
అందుకో బంగారు అక్షతల పూజలు…
చేయించుకో స్వర్ణ కలశాల పాల అభిషేకములు…
పదునాల్గు  భువనాల ప్రేమ మూర్తీ…
ఎన్న తగునా నీ దయా హృదయ కీర్తి….!! జంగమ!!

ఆత్మ సౌందర్యము కలవారు కనగలరు నీ సౌందర్య రూపం….
ధర్మమాచరించువారు కనగలరు నీ అంతరంగం…
అపర పుణ్యాత్ములవ్వాలని నిను కొలుచుచూ…
నీ పాద ధూళి నవ్వాలని నిత్యమూ నిను తలచుచూ…
నమశ్శివాయ మంత్రాల నినాదాల  హోరులో…
జగద్విఖ్యాత సార్వభౌమా.. నిను కని తరించాలని కనును ఎన్ని కలలో…!!జగ!!

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆదిదేవా…
సంక్లిష్ట సంకటముల నుండి రక్షించి ఆదుకోవా…
అనంత విశ్వమోహనాకార శ్రీ మహాదేవా…
అత్యంత భక్తి ప్రపత్తులు కలిగెదము కరుణించ తరలి రావా…
అసంఖ్యాకమైన నీదు కీర్తనలు వ్రాసి.. వ్రాసి..
అర్తించెదను శంకరా…నీ చరణాల రాశి పోసి…!! జంగమ!!

పాహిమాం…పాహిమాం…పార్వతీశా...పాహిమాం…రక్షమాం… రక్షమాం… గౌరీ మహేశా రక్ష మాం ..🙏

Leave a Comment

Scroll to Top