శివ విష్ణు రూపం…

శివ విష్ణు రూపం…
దర్శనం…మోక్ష ప్రదాయకం…
హరి హరుల వీక్షణమ్…
సందర్శనం…పాప సంహరణల సూచకం…
హే మాధవా… కాళునిలో కొలువైతివా…
హే కేశవా… కొలువుండి భువిజనుల వరమైతివా…!!శివ!!

కొలిచినా ఇద్దరిని వేర్వేరుగా…
పూజించినా వేర్వేరు పద్ధతులుగా…
ఒక్కటై పొందెదరు మా పూజలు…
మీరొక్కటై ఇచ్చెదరు ఆశీస్సులు….!!శివ!!

కేశవా…జన్మకు ఆత్మ నిచ్చెదవు నీవు…
హే శంకరా…ఆత్మకు ప్రాణమిచ్చెదవు నీవు…
ప్రతి ప్రాణి హృదయాన కొలువుండు రిద్దరూ…
ప్రతి జన్మ కడదాక తోడుండురిద్దరూ…!!శివ!!

పాహిమాం…పాహిమాం…శివ కేశవాయ పాహిమాం…రక్ష మాం..రక్ష మాం..హరి హరాయా శివా రక్షమామ్…

Leave a Comment

Scroll to Top