శైవం…వైష్ణవం…

శైవం…వైష్ణవం…
శివశంకరం…మాధవం…
లోకం..సమస్తం..
ఈశ్వరం…కేశవం…!! శై!!

ప్రార్థనలకు ఈశ్వరుడు పరవశించు…
కీర్తనలకు కేశవుడు సంతసించు..
గాన మధురిమల గంధాలను అందుకొను శివుడు…
రాగ తాళముల మదువులను రుచి చూడు లక్ష్మీవిభుడు…
కడకు కరుణించునిద్దరూ పరవశము చెంది…
తుదకు దీవించునిద్దరూ ఆనందమును పొంది…!!శై!

సులభముగ లొంగేను శంకరుండు….
కఠిన తపసు లకు కరిగేను మాధవుండు….
భక్తులకు లొంగడం ఇద్దరికీ ఇష్టము…
దీవించుటకు పడుదురు ఎంతైన కష్టము…
శైవము వైష్ణవం సృష్టి మూలం…
కరుణించు శక్తుల ప్రేమ సమ్మిళిత రూపం…!!శై!!

పాహిమాం…పాహిమాం..శివకేశవాయ పాహిమాం…రక్ష మాం..రక్ష మాం.. హరి హరాయ రక్షమాం…

Leave a Comment

Scroll to Top