జయ జయ శివకామినీ…
జయ మంగళ రూపిణీ…
ప్రియ శివ సగభాగినీ…
సుమధుర సంతోషిణీ…
మంగళం…మంగళం…మా తల్లీ మంగళం…
శుభకరం..శుభకరం…నీ నగవే శుభకరం…!!జయ!!
అరవిరిసిన ఆ నీ కనులు…
కురిపించును తల్లీ ప్రేమల సిరులు…
విరబూసిన సుమమై మెరిసే నవ్వులు…
చిందించును తల్లీ..వెన్నెల వెలుగులు….
జననీ శంకర కవయిత్రి…
మము చల్లగ చూడవే హిమపుత్రి…!!జయ!!
తహ తహ లాడెను చూడే కరములు…
చేయాలని నీకు కుంకుమ పూజలు…
తపనలు పడెనే మా ఈ మనసులు…
ఇవ్వాలని నీకు చీరలు, గాజులు..
అమ్మలగన్న మా యమ్మ…
కాదనకుండా వరమీయమ్మ…!!జయ!!
పాహి..పాహి మాతల్లీ…
మాం పాహి పాహి శివ మరుమల్లి…