పచ్చనీ మారేడు దళములు…

పచ్చనీ మారేడు దళములు…
పసుపు పచ్చనీ పూబంతి మాలలు..
వేశాము భక్తితో శివ శంకరా…
మనసార కొలిచాము ఆర్తితో శంభో హరా…!!ప!!

అలుపనక చేయాలనిపించు నీ పూజలు…
రేయి పవలనక చేయాలనిపించు నీ సేవలు…
ఆపకుండా చెప్పాలనిపించు నీ స్తోత్రము…
కన్నార్పకుండా చూడాలనిపించు నీ రూపము…!!ప!!

శివా…నీ నుదుటి పైనున్న అడ్డ నామాలని…
దర్శించితే దాటించు గడ్డు కాలాలని..
హరా…మూసుకొని వున్న నీ ముక్కన్నుని…
తిలకించితే కాల్చేయు మాలోని పాపాలని…
భస్మీ పటలమయ్యేను మా భ్రమలు అన్నియూ…
నీకు పాన వట్టములయ్యేను మా హృదయము లన్నియూ….!!ప!!

పాహిమాం…పాహిమాం..శివా పాహిమాం…పాహిమాం…రక్ష మాం..రక్ష మాం…హరా…రక్ష మాం..రక్ష మాం….

Leave a Comment

Scroll to Top