ఓహో శంకరా…గంగాధర హర..

ఓహో శంకరా…గంగాధర హర..
రావా శశిధరా.. కావగ ఈశ్వరా…
వేడుకునే మనసులివి కనుము శంకరా…
మొర పెట్టుకునే జన్మలివి వినుము శంకరా…!!ఓహో!!

వెంటాడే కర్మలను నిలువరించగా…
వెను వెంటనే మా పాపాలను తరిమి కొట్టగా…
శక్తి నివ్వు శంకరా…మది శుద్ధమవ్వగా….
స్ఫూర్తి నివ్వు శంకరా…పరమ భక్తుడవ్వగా….!!ఓహో!!

ఆ సేతు హిమాచలం నీ నివాసమై..
ఆ ముక్కోటి దేవతలు పూజించు దైవమై…
వెలుగు లీను శంకరా…ఈ సృష్టి కావగా…
ప్రాణ దీపమవ్వు శంకరా…పూజించ విరివిగా…
శంభో హర అర్పించితి మనసు పూల మాలని…
గంగాధర వినిపించితి నా మనసు రచన గీతిని…!!ఓహో!!

పాహిమాం…పాహిమాం…పార్వతీ శ పాహిమాం…రక్ష మాం…రక్ష మాం..శాంకరీశ రక్ష మాం…

Leave a Comment

Scroll to Top