వినాయకా…భక్త వరదాయకా…
గణనాయకా…సుగుణ శుభ దాయక…
చేసేము భక్తితో నీ పూజలు…
జరిపేము శ్రద్ధతో నీ నవరాత్రులు…
విఘ్నరాజా ఇవ్వరా నీదు దీవెనలు…
కొలిచేము నిను మేము ఏడు వారాలు….!!వి!!
జ్ఞాన సిద్ధిని కలిగించు విఘ్నేశ్వరా…
లక్ష్య సిద్ధిని గావించు విఘ్నరాజేశ్వరా….
ఏకదంతా….ఒక్క క్షణమైననూ నిను మేము మరువమయ్యా…
సూక్ష్మ నయనా…ప్రతి ఏడూ నీ సంబరం చేతుమయ్యా…!!వి!!
తెస్తుమయ్యా నీకు పూల హారాలు…
ఇస్తుమయ్యా వేల తీపి ఫలహారాలు….
తృప్తిగా భోంచేసి లంబోదరా….
సంతృప్తిగా దీవించమని అనుచుంటిరా…!!వి!!
పాహిమాం…పాహిమాం…పార్వతి నందనా పాహిమాం…
రక్ష మాం…రక్షమాం…శంకర తనయుడా రక్ష మాం….