శివా శివా యని పలుమార్లు పిలిచితి….
ఓం నమః శివాయ అని పలు సార్లు తలచితి….
నీ కరుణ కరువై ఎండిన చేరాయె మనసు….
విలపించి విలపించి వాడి పోయింది వయసు….
కొలువుండ రావయ్యా నా మనసులో….
కదలాడ రావయ్య నా కలలలో…!!శివా!!
చేయమందువా నన్ను శంఖ నాదం…
పలుకమందువా నన్ను సకల వేదం…
వ్రాయమందువా నీక్కొక్క భక్తి గీతం…
అర్పించమందువా నీకు నా జీవితం…
ఆనతిస్తే చేస్తాను ఏ ఒక్కటైనా….
కనికరించి పలుకరా నీవు ఇప్పుడైనా…!!శివా!!.
ఎంత కాలమని నేను ఎదురు చూసేది….
ఎన్ని నాళ్లని నేను వేచి ఉండేది…..
దాహార్తినై వున్నాను దర్శించు కొరకు…
జిజ్ఞాశతో వున్నాను నీ పాదాలు స్పర్శించు కొరకు…
మారేడు దళములను మూటలుగా తెచ్చెద….
విభూది పుండ్రములను రాశులుగా పోసెద…
పలుకవా అపుడైన పరమేశ్వరా…
పలుకరించవా ఒక సారి శివ శంకరా…!!శివా!!
పాహిమాం…పాహిమాం….పార్వతీశా పాహిమాం…రక్షమాం…రక్షమాం.. శాంకరీశా రక్షమాం….