ఉంచనా.. ఓ సుమము నీ చెంతన….
వెలిగించనా జ్యోతులను తొలి సంధ్యన…
చెందెరా నా మనసు పరివర్తన…
కననుందిరా నటరాజ నీ పద నర్తన…
ఆ క్షణములో నీ పాద మన్నవ్వనీ…
తక్షణము తరియించి మునినవ్వనీ…!! ఉంచనా!!
వదులుకోలేకుంటి భవ బంధము…
నేను తెంచుకోలేకుంటి అనుబంధము….
చూపలేకుంటి ఏ కాస్త భక్తిని….
తొలగించుకొన లేకుంటి మది లోని కుళ్ళుని…
పాహిమాం ఆంటిని పట్టించుకొనరా…
శివా…నా చేత నీ గుడిని కట్టించుకొనరా….!! ఉంచనా!!
పూజారినై ఉందు పగలు రాత్రిళ్ళు…
ఆ నందినై సేవింతు భువిన ఉన్నన్నాళ్ళు….
బిల్వ వృక్షమై ఎదిగేను నీవు గుడిన ఉన్నన్నాళ్ళు….
మారేడు దళములను ఇచ్చేను నీ ఆజ్ఞ ఉన్నన్నాళ్ళు…
శివా… నీ దయ వలన లేవేవి దీన వేదనలు….
శివా…నాకు ఉన్నందువలన నీదు దీవెనలు….!! ఉంచనా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం..