వృషభరాజా నీవు ఎక్కడయ్యా…
వేగిరముగ శివుని తీస్కోరావయ్య…
వేచి ఉన్నాము హరుని పూజ చేయ…
అర్రులు జాచిఉన్నాము తనకి హారతీయ్య….
జాగసేయక రావయ్యా ఓ మహానంది….
ఆ కరుణామయుని చూసి తరించవలెనన్న ఆశ మిగిలివుంది…!! వృషభ!!
రోజు రోజుకి తరుగుతున్నదని నా ఆయువు…
మనసు కలత చెందుతున్నది తానవ్వాలనీ శివుని పద రేణువు…
చూపు తక్కువయ్యే సూచనుంటోందని…
హెచ్చరిస్తున్నవి కనులు ప్రేమమూర్తిని దర్శించుకొనమనీ అని…
వింటివని అనుకుంట నా దీన గాథ…
వృషభమా…దయవుంచి శంకరునికి వినిపించరాదా….!!వృషభ!!
చెంతనే వుంటావు ఫణి భూషణుని సేవకు….
మంచి తరుణమును గమనించి నా మనవి వినిపించు విశ్వేశ్వరునకు….
ప్రేమగా నిను నిమురునపుడు పరమేశ్వరుండు…
సుతిమెత్తగా వివరిస్తే శంకరుడు చెవినేసుకోగలడు…
తాను కరుణించెనా అది నా పూర్వ పుణ్యము…
నేను తగనైతినా అది నా కర్మ ఫలము…
!!వృషభ!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం..