హే శంకరా…కాశి విశ్వేశ్వర..

హే శంకరా…కాశి విశ్వేశ్వర..
అభయంకరా….అంబికా హృదయేశ్వరా….
ఎంతోటి భాగ్యమ్ము నిచ్చావు నాకు…
నిను నమ్ముకొని వున్న ఈ సాహితీప్రియునకు…
మయూరనాదేశ్వరునిగా నిను గాంచినాను…
దర్భారణ్యేశ్వరునిగానూ దర్శించి తరియించినాను…
ఇంతోటి వరమిచ్చి శంకరయ్య…
నీ ఋణమును ఇంకాస్త పెంచావు ఈశ్వరయ్య…!! హే!!

శక్తినిచ్చావు నీ క్షేత్రములు తిరుగగలగా….
నాలోన భక్తి పెంచావు నిను దర్శించుకొను తపన పెరగ…
ఎన్ని క్షేత్రములైననూ దర్శిస్తా ఇట్లాగే కొనసాగనిస్తే…
ఎన్ని సార్లైననూ వస్తుంటా నీవు అభయమిస్తే….
పుట్టినందుకు పుణ్యచరితుడను కానీ….
నీవు జన్మనిచ్చినందులకు జంగమా…నీ భక్తుడగా మిగలనీ…!!హే!!

అద్భుతమయ్యా నీ దర్శనం సోమస్కంద మూర్తి….
కంటివా నిను కనినపుడు నా కనుల ఆర్తి….
తిరగాలనే వుంది నీ గుడుల చుట్టూ…..
నీ పాదాలు ముట్టాలనే వుంది నా మీద ఒట్టు….
చేయకున్నా నేను ఏ పూజ నీకు…
నన్ను రప్పించుకున్నావు నీ గుడి వైపు వరకు…
నీ మంచి మనసుకు నేను ఏ పేరు పెట్టను…
శివా…జన్మ కడదాక నేను నిన్నొదిలి పెట్టను…!!హే!!

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top