కాశీపురాధీశ విశ్వేశ్వర….
కాత్యాయనీ హృదయ కాళేశ్వరా…
ఫలములతో హారాలు చేసి వేశాము…
పుణ్యఫలములను ఇమ్మనుచు కోరుచున్నాము….
రేపనక మాపనక జాగు సేయద్దు…
మా గత జన్మ పాపాలు లెక్క వేయద్దు…
తెరిచితివా నీవు మా పాపాల చిట్టా…
పరమేశ్వరా…మేము బ్రతికేది ఎట్టా?…!!
కాశీ!!
చేస్తూనే ఉంటాము తప్పులు…
వేస్తూనే ఉంటాము తప్పటడుగులు…
ఆడుతూనే ఉంటాము అసత్యాలు…
దాటుతూనే ఉంటాము హద్దులు…
నిగ్రహించుకోలేక పంచేంద్రియాలు…
విడిపించుకొనకున్నాము మా పూర్వ కర్మలు…!! కాశీ!!
చేయిస్తూనే వుంటావు మా చేత తప్పులు…
వేయిస్తూనే వుంటావు అంచేత తప్పటడుగులు…
ఆడిస్తూనేవుంటావు అసత్యాలు…
దాటిస్తూనే వుంటావు హద్దులు…
పరీక్షించెదవు నీవు మా నిగ్రహమును…
ఇవ్వాలనీ నీవు నీ అనుగ్రహమును…!!కాశీ!!
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్షమాం..రక్షమాం..