మరల రానిది శివా ఈ నిముషము…
తరలి రావా శివా మా కోసము..
కలగ మిగిలేను శివా మా వాంఛలు…
కనుక దీవించి ఇవ్వయ్య అక్షింతలు…
పరితపించి ఉన్నాము నీ పాద స్పర్శ కోసం….
మేము చేయి జాచి ఉన్నాము నీ దయా భిక్ష కోసం…!!మరల!!
ఇష్టదైవమైతివి మాకు ఈశ్వరయ్యా…
మా కష్ట సుఖములు నీకెరుక శంకరయ్యా….
సన్నిహితుడవు నీవు ఎవరికైనా…
నీ సాన్నిహిత్యము కరువైతే బ్రతుకు వ్యర్థమన్నా….
ఏకాఎకిగా మా బాధలు తెలుపుకున్నా…
ఏక కాలమున తీర్చేవు నీవు శంకరన్నా…!!మరల!!
కాల పరీక్షల కదనాన ఓడిపోయి…
సమస్యల సుడిగుండాలలో ఉండిపోయి….
జీవన యానమున మేము వడలి పోయి…
రాగ బంధాలకు మేము లొంగిపోయి….
వెలిగించు హృదయాలు కరువైన దీపాలమైతిమి…
కరుణించు నిను మేము పూర్తిగా మరచి పోయుంటిమి…!!మరల!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం..రక్షమాం..